నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా
నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవు నీవే యేసయ్యా
ఆకలితో నే అలమతించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నవు(2)
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా “నా ప్రతి అవసరము”
ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువ లేక నను కాచుచుంటివి(2)
కష్టాల ఎన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీచేతి నీడ ఎప్పుడు నను దాటి పోదు
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా “నా ప్రతి అవసరం”
తప్పి పోయినా త్రోవ మరచిన నీ కృప నన్ను విడచి వెళ్ళదు నీ కృప విడచి వెళ్ళదు (2)
నీ కృప విడచి వెళ్ళదు (2)
నను ఎన్నడూ యేసయ్యా
నాప్రతి విన్నపం నీ చెంత చేరును యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్య(2)
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా
ఏమివ్వ గలను ఎనలేని ప్రేమకి యేసయ్యా వందనము